
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad: హైదరాబాద్ ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు మరో అత్యాధునిక ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో టిమ్స్ ఆస్పత్రి (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మాణ పనులు ప్రారంభమవగా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసింది. ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించగా.. త్వరలో ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల టిమ్స్ ఆస్పత్రికి ప్రభుత్వం అధికారులు, వైద్యులు, వైద్యారోగ్య సిబ్బందిని నియమించింది. ఈ ఆస్పత్రికి ప్రభుత్వం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టారు. రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, ఇతర అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ వేదిక, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ, ప్రజల రాకపోకలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ట్రాఫిక్ పోలీసులను మంత్రి దామోదర