ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఆ జిల్లాలో ఇద్దరు మృతి
Actor ProfilePolitician

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఆ జిల్లాలో ఇద్దరు మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఆ జిల్లాలో ఇద్దరు మృతి, నలుగురికి పాజిటివ్..కీలక సూచనలు
10TV Telugu19 Oct 2026
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఆ జిల్లాలో ఇద్దరు మృతి, నలుగురికి పాజిటివ్..కీలక సూచనలు

AP Covid Cases : యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఏపీలో మళ్లీ విజృంభిస్తోందా ఆనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏపీలో నాలుగేళ్ల తరువాత కరోనా వైరస్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. మరో నలుగురికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది. అధికారుల సమాచారం ప్రకారం.. కరోనా సోకిన నలుగురిలో ముగ్గురు స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరో వ్యక్తిని కడపలోని ఆస్పత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ నలుగురికి కడపలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నిర్దారణ అయింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన నలుగురూ గతంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా.. వారిలో ఒకరు బూస్టర్ డోసు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ఏపీలో కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో పలు విధాలుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ స్పందించింది. ఈ మేరకు కోవిడ్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడింది. ఎన్. సుబ్బరాయుడు (52) మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతూ జూన్ 28న చికిత్స పొందుతూ మృతి చెందారు. సయ్యద్ మబాషా (43) దీర్ఘకాలంగా మద్యం సేవించే అలవాటు ఉండగా, తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతూ జూలై 7న కన్నుమూశారు. మరోవైపు వీరారెడ్డి (66) మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతూ చికిత్స అనంతరం కోలుకుని జూలై 4న తిరుపతికి డిశ్చార్జ్ అయ్యారు. జి. కొండయ్య (67) మధుమేహం, క్షయవ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం కడప ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్షత్ (25)కు కరోనా సోకినా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో హోమ్ ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే, కరోనా