ఏపీలో బీసీ రక్షణ చట్టం
Actor ProfilePolitician

ఏపీలో బీసీ రక్షణ చట్టం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో బీసీ రక్షణ చట్టం
TeluguOne27 Nov 2026
ఏపీలో బీసీ రక్షణ చట్టం

ఆంధ్రప్రదేశ్ లో బీసీ సంక్షేమం, భద్రత, సామాజిక న్యాయం దిశగా కూటమి వ్యూహాత్మకంగా, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో బీసీల హక్కులను పరిరక్షణతో పాటు.. వారికి సమగ్రమైన చట్టబద్ధమైన రక్షణ కల్పించే లక్ష్యంతో బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో లోకేష్ యువగళం పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభలలో బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి ఆత్మీయ సమావేశాలలో లోకేష్ బీసీ రక్షణ చట్టంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న వేధింపులు, అక్రమ కేసుల ముప్పు నుంచి వారికి శాశ్వత విముక్తి కలిగించడమే ఈ ప్రతిపాదిత చట్టం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసానికి తోడ్పాటునందించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని లోకేష్ పునరుద్ఘాటించారు. బీసీ రక్షణ చట్టం వివరాలు, నియమావళి, అమలు తీరుతెన్నులను విశ్లేషిస్తే, రాష్ట్రంలో బీసీల ఇది రక్షక కవచం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బీసీ వర్గానికి ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలపై అనేక రకాల అక్రమ కేసులు నమోదయ్యాయి. సుమారు 26 వేల మందికి పైగా బీసీలపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుఅయ్యాయి. వారిని జైళ్ల పాలయ్యారు. తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఇటువంటి అన్యాయాలను పూర్తిగా అరికట్టేందుకు బీసీ రక్షణ చట్టం దోహదపడనుంది. ఈ చట్టం అమలులోకి వస్తే, బీసీలకు చెందిన వారిపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం ఉండదు, ఒకవేళ దురుద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే బాధితులకు ఉచితంగా న్యాయ సాయం అందించే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరిస్తుంది. న్యాయపోరాటం చేయడానికి అయ్యే అన్ని రకాల ఖర్చులను కూడా ప్రభుత్వం తరఫున భరిస్తూ, వారికి నిరంతరం లీగల్ సపోర్ట్ అందిస్తుంది. కేవలం రక్షణ చట్టానికే పరిమితం

ఏప ల బ స రక షణ చట ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in