ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ కాలేజీలలో అధిక ఫీజులపై ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి సూర్యచంద్రరావు సీరియస్‌గా స్పందించారు. కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉంచుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేశారు. రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థులు, మీడియా ద్వారా ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ దృష్టికి వచ్చిందన్నారు.రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన కన్వీనర్ కోటా ఫీజు కంటే ఎక్కువ డిమాండ్ చేయకూడదన్నారు. ప్రవేశాల సమయంలో, కోర్సు పూర్తయిన తర్వాత, కోర్సు మధ్యలో విద్యార్థులు వెళ్లిపోయేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చేయాలని.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని, గుర్తింపు రద్దుచేయాలని యూనివర్సిటీలకు సిఫార్సు చేస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీలు నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయాలని సూచించారు.ఈఏపీసెట్‌లో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో చేరే సమయంలో రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్లు పొంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తోంది. అందుకే ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అలాట్‌మెంట్ లెటర్లలో విద్యార్థులు చెల్లించాల్సిన కాలేజీ ఫీజు ‘0’ అని ప్రస్తవించారు. కొన్ని కాలేజీలలో మాత్రం ప్రభుత్వం ఫీజులు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదు కాబట్టి మొదట కొంత ఫీజు చెల్లించాలని చెబుతున్నారు. రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం నుంచి రాగానే ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెబుతున్నారు. ఇలా ఫీజులు కట్టమని అడగటంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ అంశంపై ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ స్పందించింది. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్వీనర్ కోటాలో ప్రైవేట్ కాలేజీలలో చేరిన విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు
Actor ProfilePolitician
ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరిక.. విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే జరిమానా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•21 Dec 2026
ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరిక.. విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే జరిమానా, గుర్తింపు రద్దు