ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది.. పీఎంఏవై యు 2.0 (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) పథకం కింద మరోసారి పేదలకు ఇళ్లు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి కొత్తగా 12,370 ఇళ్లు మంజూరు చేయనున్నారు. కొత్తగా మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి రూ.185.55 కోట్లు సాయం అందించనుంది. తొలి విడతగా రూ.74.22 కోట్లు మంజూరు చేయనున్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల నిర్వహించిన సీఎస్ఎంసీ సమావేశంలో కొత్త ఇళ్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. కొత్తగా మంజూరు ఈ 12,370 ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా 119 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మించనున్నారు. అంతేకాదు కేంద్రం పీఎంఏవై, పీఎంఏవై-యు 2.0 పథకాల కింద ఏపీతో పాటుగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30లోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ఒకవేళ చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే సాయం అందించబోమని తేల్చి చెప్పింది. ఆ తర్వాత ఖర్చుల్ని రాష్ట్రాలు భరించాలని తేల్చి చెప్పింది. ఏపీకి కేంద్రం పీఎంఏవై-యు 2.0 పథకం కింద గతంలో రూ.233.80 కోట్లు మంజూరు చేస్తే.. రూ.41.85 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరగా ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో 2026 మార్చి నెల నాటికి లక్షా 20వేల ఇళ్ల నిర్మాణానికి టార్గెట్ పెట్టగా.. 45,230 ఇళ్లకు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి మంజూరైన ఇళ్లలో కేవలం 16వేల 283మాత్రమే మొదలయ్యాయి. రాష్ట్రంలో 45వేల 230మందికి నిధులు విడుదల చేయగా.. కేవలం 12,776 మందికి మాత్రమే అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన సాయం, ట్రెజరీలో ఉన్న రూ.121.71 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులపై కీలక ఆదేశాలు ఇచ్చారు. బీఎల్‌సీ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు.. ఈ ఇళ్లకు కేంద్రం నుంచి సాయం అందదు. కేంద్రం ఇప్పటికే
Actor ProfilePolitician
ఏపీలో పేదలకు కేంద్రం తీపికబురు.. ఉచితంగా ఇళ్లు మంజూరు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•1 Oct 2026
ఏపీలో పేదలకు కేంద్రం తీపికబురు.. ఉచితంగా ఇళ్లు మంజూరు, రూ.188 కోట్లు సాయం