ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్ పర్యటన సక్సెస్
Actor ProfilePolitician

ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్ పర్యటన సక్సెస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్ పర్యటన సక్సెస్
AP7AM8 Oct 2026
ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్ పర్యటన సక్సెస్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న పర్యటనలో కీలక ముందడుగు పడింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాదరక్షలు, వాటి అనుబంధ పరికరాల తయారీ సంస్థ 'బూ యంగ్ గ్రూప్' (Boo Young Group) యాజమాన్యంతో ఆయన జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటుకు బూ యంగ్ గ్రూప్ సానుకూలత వ్యక్తం చేసింది.బుసాన్‌లో బూ యంగ్ గ్రూప్ సీఈవో & ప్రెసిడెంట్ ర్యాన్ కాంగ్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కంపెనీని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని లోకేశ్‌ వివరించారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.మంత్రి లోకేశ్‌ ప్రతిపాదనలపై బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు వీలుగా 'రెడీ బిల్ట్ షెడ్ల' కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ సంస్థ స్కైకార్ప్ గ్రూప్‌లో భాగమని, ప్రపంచవ్యాప్తంగా 4,300 మంది కస్టమర్లు, 1.10 లక్షలకు పైగా అంతర్జాతీయ షిప్‌మెంట్లు నిర్వహించేంత

ఏప ల ప దరక షల పర శ రమ ప ట ట బడ క బ య గ గ ర ప స మ ఖత ల క శ పర యటన సక స స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in