ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నటుడు సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ వరుస ట్వీట్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఆయన ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభతో పాటుగా జైభీమ్ పార్టీ అధినేత, లాయర్ జడ శ్రవణ్ కుమార్‌పై ఓ ట్వీట్ చేశారు. అలాగే ఏలూరు సభలో ప్రసంగాలు, ఆ తర్వాత నమోదైన కేసులు, అరెస్ట్‌లు అంటూ స్పందించారు. నటుడు నరేష్ పరోక్షంగా ప్రశ్న రావణ్ అరెస్ట్ సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ ఓట్ల కోసం జరుగుతున్న ఓ రాజకీయ వ్యూహంగా ఆయన చెప్పుకొచ్చారు. నరేష్ తాజాగా మరోసారి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు.నరేష్ ఈ నెల 1న చేసిన ట్వీట్‌ను గుర్తు చేస్తూ.. 'ఐదు రోజుల క్రితం నేను ఈ ట్వీట్ చేసినప్పుడు, తమిళనాడు ఎన్నికలపై నా అంచనాలాగే ప్రజలు నన్ను తేలికగా తీసుకున్నారు. ఈ రోజు ఈ విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని వెనుక మత, రాజకీయ కుట్ర ఉందని నేను స్పష్టంగా చెప్పాను. గుండెపోటుకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు, ఇతరులు.. ప్రశ్న, జడ శ్రవణ్ అండ్ టీమ్‌కు పూర్తి మద్దతుగా ముందుకు వచ్చారు. నేను ఏ పార్టీ మద్దతు తెలియజేయడం లేదు.. కానీ ఈ పరిణామాలను అధ్యయనం చేస్తున్న ఒక రాజకీయ పరిశీలకుడిని మాత్రమే. ఇప్పటికైనా మేల్కొనండి.. రాష్ట్రం మాత్రమే కాదు, దేశం మొత్తం ఈ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వెయిట్ అండ్ సీ.. ఊరికే చెబుతున్నాను' అంటూ నరేష్ ట్వీట్ చేశారు.నరేష్ ఈ నెల 1న చేసిన ట్వీట్‌లో.. 'జైభీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ అండ్ టీమ్ తీవ్రమైన మత, రాజకీయ ప్రచారం.. ఆ తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్‌లు, అరెస్టులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే అధికారి కూటమిని సవాల్ చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు
Actor ProfileActor
ఏపీలో నేను చెప్పిందే జరుగుతోంది.. ఆ నలుగురు కలిసిపోయారు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•1 Oct 2026
ఏపీలో నేను చెప్పిందే జరుగుతోంది.. ఆ నలుగురు కలిసిపోయారు