ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు
Actor ProfilePolitician

ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా
Oneindia Telugu13 Dec 2026
ఏపీలో కొత్త జిల్లా పరిషత్ లు, 'స్థానికం' వేళ అనూహ్య నిర్ణయం- పునర్విభజన ఇలా

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ముందుగా మున్సిపల్ తరువాత జిల్లా పరిషత్ ఎన్నికలకు వీలుగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా పరిషత్ ల సంఖ్య పెంపు దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్తగా 15 జెడ్పీలు ఏర్పడనున్నాయి. దీంతో.. ఈ నిర్ణయం రాజకీయంగా పార్టీల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో స్థానిక ఎన్నికల దిశగా వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ కేడర్ కు ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేస్తున్నాయి. ముందుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల కు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం ఖరారు తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అక్టోబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో 15 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాకో జడ్పీ ఏర్పాటుకు ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్‌ల పునర్విభజన చేపట్టనున్నారు. దీంతో.. మొత్తం 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబరు 24వ తేదీతో అన్ని జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్లు, జడ్పీటీసీల పదవీకాలం, అంతకుముందు రోజే ఎంపీటీసీలు, మండల పరిషత్‌ అధ్యక్షుల పదవీకాలం ముగియనుండటంతో.. ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్..!!తాజా కసరత్తు.. కీలక నిర్ణయాలుకాగా.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే లోగా జిల్లా పరిషత్‌ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత కసరత్తులో భాగంగా పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ ఆ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటిని ప్రభుత్వానికి పంపి క్యాబినెట్‌ ఆమోదం తీసుకోవల సి

ఏప ల క త త జ ల ల పర షత ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in