
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు


రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో భాగంగా, సియోల్‌లో ఆయన పలు ప్రతిష్టాత్మక కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆటోమోటివ్ దిగ్గజం 'హ్యుందాయ్ మోబిస్', సెమీకండక్టర్ సంస్థ 'అపాక్ట్' (ఏపీఏసీటీ) ప్రతినిధులతో ఆయన జరిపిన చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.హ్యుందాయ్ మోబిస్‌కు కీలక ప్రతిపాదనలు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్) సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లోకేశ్ పలు కీలక ప్రతిపాదనలను హ్యుందాయ్ మోబిస్ ముందుంచారు. తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలి. విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ, ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలి. అనంతపురాన్ని పూర్తిస్థాయి ఆటోమొబైల్ హబ్‌గా మార్చేందుకు, టైర్-1 సరఫరాదారుల సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలి.భారత్‌లో హ్యుందాయ్ మోబిస్ విస్తరణ ప్రణాళికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం