ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు మరో కీలక అడుగు పడింది. అదానీ గ్రూప్ రాష్ట్రంలో సుమారు రూ.16 వేల కోట్ల పెట్టుబడితో టైటానియం ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అంశంపై అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై చర్చించింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఏపీలో లభించే బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.కేవలం ఖనిజాలను మాత్రమే వెలికితీసి విక్రయించడం కాకుండా.. వాటిని రాష్ట్రంలోనే ప్రాసెస్ చేసి ఫైనల్ ఉత్పత్తులుగా మార్చడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వాలని సీఎం చంద్రబాబు.. అదానీ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. బీచ్‌శాండ్‌లో లభించే ఇల్మెనైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేయడం ద్వారా టైటానియం స్లాగ్, టైటానియం డయాక్సైడ్, టైటానియం స్పాంజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చని అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది.వాటికి పెయింట్స్, కోటింగ్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్స్, పాలిమర్స్, యూవీ ప్రొటెక్షన్ ఉత్పత్తుల వంటి రంగాల్లో వినియోగం ఉంటుందని ముఖ్యమంత్రికి వివరించారు. అరుదైన భూఖనిజాల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించేందుకు రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు.. సంబంధిత అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక భాగస్వామ్యాలను గుర్తించాలని ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిపింది.టైటానియం ప్లాంట్‌కే పరిమితం కాకుండా విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులపై కూడా అదానీ గ్రూప్ ప్రతినిధులు వివరాలు అందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్, వెయ్యి పడకల అదానీ ఆరోగ్య మందిర్ ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబుకు అదానీ గ్రూప్ వివరించినట్లు సమాచారం.అదే సమయంలో విశాఖలో
Actor ProfilePolitician
ఏపీలో అదానీ గ్రూప్ మరో భారీ పెట్టుబడి.. చంద్రబాబుతో భేటీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•16 Dec 2026
ఏపీలో అదానీ గ్రూప్ మరో భారీ పెట్టుబడి.. చంద్రబాబుతో భేటీ, రూ.16 వేల కోట్లతో టైటానియం ప్లాంట్