ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ కంపెనీకి కేటాయించిన 14 వేల ఎకరాలు వెనక్కు తీసుకున్నారు
Actor ProfilePolitician

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ కంపెనీకి కేటాయించిన 14 వేల ఎకరాలు వెనక్కు తీసుకున్నారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ కంపెనీకి కేటాయించిన 14 వేల ఎకరాలు వెనక్కు తీసుకున్నారు
Samayam Telugu19 Oct 2026
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ కంపెనీకి కేటాయించిన 14 వేల ఎకరాలు వెనక్కు తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఏకంగా 18 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం పరిధిలో బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు ఈ 14వేల ఎకరాల భూమిని కేటాయించారు. కానీ ఈ భూమిని వినియోగించకపోవడంతో 2011లోనే స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ప్రక్రియ జరగలేదు. అప్పటి నుంచి ఈ భూమి వ్యవహారం అలా పెండింగ్‌లో ఉంది.. కలెక్టర్ చొరవతో చివరికి భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ 14వేల ఎకరాల భూమి స్వాధీనానికి సంబంధించి కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ భూమిని భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉందంటున్నారు. 2007లో జమ్మలమడుగు ప్రాంతంలో బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌ భారీ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ఓఎంసీ (ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ) ప్రమోటర్లు, గాలి జనార్దనరెడ్డి ప్రతిపాదించారు. స్టీల్ ప్లాంట్ కోసం 10,700 ఎకరాలకుపైగా.. ఎయిర్‌పోర్ట్ కోసం మరో 3,115 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. కానీ 2009లో పరిణామాలు మారిపోయాయి.. కర్ణాటక అక్రమ మైనింగ్‌ కేసులు, న్యాయవివాదాలు, ప్రభుత్వపరమైన నిర్ణయాలతో స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 2008లో అప్పటి ప్రభుత్వం 3,115 ఎకరాలను ఎకరా రూ.25వేల చొప్పున కేటాయించింది. అక్కడ కమర్షియల్‌ ఎయిర్‌పోర్టు, ఫ్లయింగ్‌ అకాడమీ, ఏరో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఈ భూమిని కేటాయించారు. ఈ భూమిని ఆ కంపెనీలు స్వాధీనం చేసుకున్నా సరే ఎలాంటి నిర్మాణాలు చేయలేదు.. కేవలం అక్కడ గతంలో కాంపౌండ్ వాల్ నిర్మించినా ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం (బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం) ప్రభుత్వం కేటాయించిన భూమిని నిర్దేశించిన ప్రయోజనం కోసమే వినియోగించాలి. కానీ ఈ భూమి విషయంలో ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు మే నెలలో రెవెన్యూ అధికారులు సదరు సంస్థకు షోకాజ్ నోటీసులు పంపారు. కానీ ఈ భూమికి