
10GW డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించండి స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు చేయూత అందించండి యువతను ఫ్యూచర్ స్కిల్ వర్క్ ఫోర్స్ గా మార్చేందుకు సహకరించండి దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఇన్వెస్ట్ మెంట్స్ ఉపమంత్రి కామ్చాన్ కాంగ్ తో మంత్రి లోకేష్ సమావేశం సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఇన్వెస్ట్ మెంట్స్ ఉపమంత్రి కామ్చాన్ కాంగ్ (Mr. Kamchan Kang)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ యువతను భవిష్యత్తుకు సిద్ధమయ్యే డీప్ టెక్ వర్క్ ఫోర్స్ గా తయారుచేయడానికి కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో 2029నాటికి 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పరిశోధనలకు సహకారం అందించాలి స్టూడెంట్/ ఫ్యాకల్టీ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లు, కరిక్యులమ్ డెవలప్ మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ – కొరియా విశ్వవిద్యాలయాలను అనుసంధానించాలి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థలు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లీన్-టెక్, హెల్త్-టెక్ రంగాలలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై పరస్పరం సహకరించుకోవాలి. వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆర్ టీఐహెచ్, యూనివర్సిటీలు – దక్షిణ కొరియా పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణల కేంద్రాల (మాగోక్ సైన్స్ పార్క్, నానో ఫ్యాబ్ సెంటర్ వంటివి) నడుమ ఉమ్మడి పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించండి. ఏపీలో కొరియా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుచేయండి