ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంత పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రామీణ పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్-2.0 కింద తొలి విడతగా 74,812 గృహాలను మంజూరు చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏపీ నుంచి పీఎంఏవై జీ-2.0 పథకం కింద 10.42 లక్షలమంది దరఖాస్తు చేసుకుంటే.. 9.50 లక్షలమందిని అర్హులుగా గుర్తించారని.. త్వరలోనే వీరందరికి ఇళ్లు మంజూరు చేస్తారన్నారు. కేంద్రం పీఎంఏవై (అర్బన్)-2.0 పథకం కింద 57,600 ఇళ్లు, పీఎం జన్‌మన్ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో 28,430 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. గృహనిర్మాణశాఖ పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పునరావాస కేంద్రంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో 18.61 లక్షల ఇళ్లు మంజూరైతే.. వాటిలో కేవలం 6.70 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వం 4.60 లక్షల మంది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టుకున్నారనే కక్షతో బిల్లులు ఇవ్వకుండా వేధించిందని ఆరోపించారు. కేంద్రం ఏపీకి పీఎంఏవై (అర్బన్)-2.0 పథకం కింద కొత్తగా 12,370 ఇళ్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ ఇళ్ల నిర్మాణం కోసం మరో రూ.185.55 కోట్ల సాయం అందించనుంది.. తొలి విడతలో భాగంగా రూ. 74.22 కోట్లు విడుదలకు ఓకే చెప్పింది. కొత్తగా మంజూరైన ఇళ్లను 119 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మిస్తారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ 7వ సీఎస్‌ఎంసీ (సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశంలో ఇళ్ల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఏపీకి కేంద్రం వరుసగా ఇళ్లు కేటాయిస్తోంది.పీఎంఏవై గ్రామీణ పథకంలో యూనిట్ ధర రూ. 2.39 లక్షలు. రూ. 72వేలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.48వేలు, రూ.80 వేలు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. ఉపాధి హామీ పథకం క్రింద రూ.39వేలు ఇస్తారు. పీఎంఏవై అర్బన్ 2.0 పథకానికి యూనిట్ ధర రూ. 2.50 లక్షలు.రూ.1.50
Actor ProfilePolitician
ఏపీ గ్రామీణ ప్రాంత పేదలకు ఉచితంగా ఇళ్లు.. 74
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•9 Oct 2026
ఏపీ గ్రామీణ ప్రాంత పేదలకు ఉచితంగా ఇళ్లు.. 74,812మందికి లబ్ధి, ఒక్కొక్కరికి రూ. 2.39 లక్షలు ఇస్తారు