ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా
Actor ProfilePolitician

ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా - రామారావు ఆన్సర్ ఇదే
TV9 Telugu24 Sept 2026
ఏపీకి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా - రామారావు ఆన్సర్ ఇదే

జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలను నిర్భయంగా పంచుకున్నారు. బాలకృష్ణ పట్ల తనకున్న అమితమైన ప్రేమ, తెలుగుదేశం పార్టీ పట్ల తన నిబద్ధత, తన రాజకీయ ఆకాంక్షలపై స్పష్టతనిచ్చారు. నందమూరి బాలకృష్ణ అంటే తనకు ఎంతో ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ పదే పదే నొక్కి చెప్పారు. “బాల బాబాయ్ అంటే చాలా ఇష్టం. చాలా అద్భుతమైన మనిషి, చాలా మంచి మనిషి” అని అన్నారు. బాలకృష్ణ మూడీగా ఉంటారన్న బయట అభిప్రాయాలను ఖండిస్తూ, అవి “తెలిసి తెలియకుండా వాగడం” వంటివని కొట్టిపారేశారు. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ తనకు ఎంతో ప్రత్యేకమని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటూ రాజకీయ భవిష్యత్తుపై అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తాను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కార్యకర్తని అని, జీవితాంతం పార్టీ ఉప్పు తిని బ్రతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. “ఫ్యూచర్ అంటారా అది ఎవరం ఏమి చెప్పలేం. దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడి ప్రయోజనం లేదు” అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిపై తనకు ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచన లేదని, అటువంటి ఆలోచన ఎప్పుడు మొదలైతే అప్పుడే వెల్లడిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కావడానికి కేవలం ఆశ ఉంటే సరిపోదని, సాధన ఉండాలి అని ఆయన బలంగా చెప్పారు. డెస్టినీని నమ్ముతానని, రాతలో ఉంటే జరుగుతుందని, లేకపోతే ఎంత ప్రయత్నించినా కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తన తాతగారు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ పట్ల తనకు, తన కుటుంబానికి అపారమైన విశ్వాసం ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. “పసుపు జెండాను చూస్తే మాకు ఏమవుతుందో తెలియదు నర నరాన పూనకం వస్తుందని” అని తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తాతగారు ఎన్టీఆర్‌ని పదవి నుంచి తొలగించి చంద్రబాబు నాయుడు పార్టీని టేక్ ఓవర్ చేసిన ఎపిసోడ్ గురించి అడిగినప్పుడు

ఏప క మ ఖ యమ త ర క వ లన క ర క ఉ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in