ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి మరోసారి భారీగా నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలో వీబీ జీరామ్‌జీ పథకం అమలుకు కేంద్రం ఈ నిధులు ఇచ్చింది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,414.16 కోట్లు విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికుల వేతనాల చెల్లింపునకు ఈఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరుకు తొలి విడతగా ఈ నిధులు ఇచ్చారు. ఈ రూ.1,414.16 కోట్లకు.. ఏపీ వాటా కింద మరో రూ.565.66 కోట్లు (40% నిధులు) కలిపి శ్రామికులకు చెల్లిస్తారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 2న వీబీ జీరామ్‌జీ అమల్లోకి రాగా.. కేంద్రం మొదటి మూడు నెలలకు అవసరమైన శ్రామికుల వేతనాల కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో షెడ్యూల్ కులాలకు రూ.241.54 కోట్లు, షెడ్యూల్డ్ తెగలకు రూ.78.21 కోట్లు, ఇతర వర్గాలకు రూ.1,094.41 కోట్లు ఇచ్చారు. రాష్ట్రం 40 శాతం వాటా కూడా కలిపి డీబీటీ విధానంలో శ్రామికుల ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ చేస్తారు.మరోవైపు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలు విధానాన్ని సమీక్ష చేశారు.. అనంతరం నిధులు విడుదల చేశారు. ఈ నెల 2న పథకం ప్రారంభించిన తొలిరోజే రికార్డ్ స్థాయిలో ఉపాధి కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్‌ను చౌహాన్ అభినందించారు. వీబీ జీరామ్‌జీ కొత్త చట్టం ద్వారా సగటున 10శాతం వేతనాలు పెంచామని.. ఇకపై ఏ రాష్ట్రంలో రోజువారి కూలి రూ.300కంటే తక్కువగా ఉండదని తెలిపారు. వీబీ జీరామ్‌జీ పథకం అమలుకు మొదటి విడతగా రాష్ట్రాలకు రూ.25,863 కోట్లను విడుదల చేసింది కేంద్రం.భారత అభివృద్ధికి పునాది గ్రామాలే అన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సింధు నాగరికత
Actor ProfilePolitician
ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు.. నేరుగా ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో జమ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Sept 2026
ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు.. నేరుగా ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో జమ