ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్
Actor ProfilePolitician

ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
పాకిస్థాన్ భవిష్యత్తుపై రాయబారి షాకింగ్ కామెంట్స్
Oneindia Telugu30 Nov 2026
పాకిస్థాన్ భవిష్యత్తుపై రాయబారి షాకింగ్ కామెంట్స్

భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1947 ఆగస్టు 11న బ్రిటీష్ పాలన నుంచి బలూచిస్తాన్ తన స్వాతంత్యాన్ని ప్రకటించుకుంది. నాటి సరిహద్దుల ప్రకారం పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఉనికిలో లేని సమయంలోనే

ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్
Oneindia Telugu29 Nov 2026
ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్

భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు, విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలోకి ఈ-వీసా ఆధారంగా అడుగుపెట్టే విదేశీయుల కోసం కొత్తగా మరో 11 అంతర్జాతీయ ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి విమానాశ్రయంతో పాటు భోపాల్ ఎయిర్‌పోర్టు, మరో తొమ్మిది కీలకమైన ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఈ తాజా నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఈ-వీసా ద్వారా ప్రవేశించగలిగే మొత్తం కేంద్రాల సంఖ్య ఏకంగా 88కి చేరింది.కొత్తగా చేరిన ప్రవేశ మార్గాలు ఇవే!కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ కొత్త సదుపాయంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు, తొమ్మిది ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ విమానాశ్రయాల నుంచి విదేశీయులు ఇకపై నేరుగా ఈ-వీసాతో ప్రవేశించవచ్చు.వీటితో పాటు భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అట్టారీ, అలాగే అగర్తలా, దర్రంగా, గేడె, ఘోజాడంగా, హరిదాస్‌పూర్, జైగావ్, డావుకీ, మోరే ప్రాంతాల్లోని ల్యాండ్ చెక్‌పోస్టులను ఈ జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఉన్న 88 కేంద్రాలలో 37 విమానాశ్రయాలు, 38 సముద్ర పోర్టులు, 13 భూ సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నాయి.దశాబ్ద కాలంలోనే బిగ్ జంప్! దేశంలో సింహల గర్జన అదుర్స్72 గంటల్లోనే 95 శాతం ఈ-వీసాలు క్లియర్!దేశంలో టూరిజం అభివృద్ధికి, విదేశీ ప్రయాణాలను సులభతరం చేసేందుకు కేంద్రం అనేక ఆధునిక సాంకేతిక మార్పులు చేస్తోంది. అత్యంత వేగవంతమైన భద్రతా తనిఖీలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా పర్యాటకులు సులభంగా అనుమతులు పొందుతున్నారు. ప్రస్తుతం భారత్ జారీ చేస్తున్న మొత్తం వీసాల్లో దాదాపు 78 శాతం వరకు ఎలక్ట్రానిక్ వీసాలే కావడం విశేషం. అంతేకాకుండా అందిన దరఖాస్తుల్లో సుమారు 95 శాతం ఈ-వీసాలను కేవలం 72 గంటల్లోనే అధికారులు క్లియర్ చేస్తున్నారు.నిర్మలమ్మ హామీ! మూజువాణి ఓటుతో కీలక బిల్లుకు ఆమోదం43 నుంచి 172 దేశాలకు విస్తరించిన సేవలుభారత ప్రభుత్వం తొలిసారిగా 2014లో ఎలక్ట్రానిక్ ట్రావెల్