
Eenadu•30 Nov 2026
ఏఎన్నార్ ఉండి ఉంటే మంచి పని చేశావని ప్రశంసించేవారుఇంటర్నెట్ డెస్క్: ‘పళ్ళ బురుసు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda). సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని ఉదయ్ చౌహాన్ తెరకెక్కించారు. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రియ మాట్లాడుతూ.. ఏఎన్నార్ ఉండిఉంటే మంచి చిత్రాన్ని (Pallaburusu) నిర్మిస్తున్నందుకు ప్రశంసించేవారని అన్నారు. ఈ వీడియో చూశారా: ‘ఎవరే నువ్వే నాకేమవుతావే’.. ‘ఐ యామ్ గేమ్’ కొత్త సాంగ్ రిలీజ్