ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కు రోడ్డు ప్రమాదం
Actor ProfileActor

ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కు రోడ్డు ప్రమాదం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కు రోడ్డు ప్రమాదం
Chitrajyothy25 Nov 2026
ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కు రోడ్డు ప్రమాదం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ AR Rahman son Ameen),కుమారుడు, గాయకుడు అమీన్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ AR Rahman son Ameen),కుమారుడు, గాయకుడు అమీన్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో అమీన్‌తో పాటు ఆయనతో ప్రయాణిస్తున్న స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అమీన్‌ తన పోర్షే కారులో ఓ స్నేహితుడితో కలిసి గిండి వైపు వెళ్తున్నారు. ఒలింపియా టెక్‌ పార్క్‌ సమీపంలోని సిగ్నల్‌ వద్దకు చేరుకోగానే వేగంగా వచ్చిన వాగన్‌ ఆర్‌ కారు.. అమీన్‌ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టినట్లు స్థానికుల నుంచి సమాచారం. ఈ ప్రమాదంలో అమీన్‌, ఆయన స్నేహితుడికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని సమీపంలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం ఇద్దరినీ డిశ్చార్జ్‌ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. (Ameen road accident) ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్న వాగన్‌ ఆర్‌ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అతడిని కళైంగర్‌ సెంటెనరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై అడయార్‌ ట్రాఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన రెండు వాహనాలను సీజ్‌ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం కారణమనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తండ్రి ఏఆర్‌ రెహమాన్‌ బాటలో సంగీత రంగంలోకి అడుగుపెట్టిన అమీన్‌ గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు