ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి
Actor ProfileActor

ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి
Asianet News Telugu14 Oct 2026
ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి

కలర్స్ స్వాతిగా సుపరిచితురాలైన నటి స్వాతి రెడ్డి, దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని రెండో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలకు తెరలేపుతూ.. పెళ్లి బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు.పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. కలర్స్ స్వాతీ తన సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నాగోతి ఎవరు, ఆయన నేపథ్యం ఏంటనే విషయాలపై నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శ్రీకాంత్ నాగోతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఒక యువ ప్రతిభావంతుడైన దర్శకుడు. ఆయన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. సినిమాపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టి, మెల్లగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. వైవిధ్యమైన కథలతో, సరికొత్త కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నేర్పరి. నవీన్ చంద్ర, సలోనీ లూత్రా ప్రధాన పాత్రల్లో నటించిన "భానుమతి అండ్ రామకృష్ణ" (2020) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన శ్రీకాంత్.. ఆతర్వాత "మంత్ ఆఫ్ మధు" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్‌ రెండు సినిమాల్లో నవీన్ చంద్రనే హీరోగా నటించడం విశేషం. భానుమతి అండ్ రామకృష్ణ అర్బన్ రొమాంటిక్ డ్రామా ఆహా (Aha) ఓటీటీ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆధునిక సంబంధాలు, పరిణతి చెందిన ప్రేమకథను డీల్ చేసిన విధానానికి శ్రీకాంత్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆయన స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో (Month of Madhu - 2023) అనే సినిమాను రూపొందించారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం వివాహిక బంధాలలోని సంక్లిష్టతలను ఎమోషనల్‌గా చూపించింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. "మంత్ ఆఫ్ మధు" సినిమా చిత్రీకరణ సమయంలోనే శ్రీకాంత్ నాగోతి, స్వాతి రెడ్డిల మధ్య పరిచయం ఏర్పడింది

ఎవర శ ర క త న గ త కలర స స వ త ప ర మల ఎల పడ డ డ ర డ ప ళ ల క క రణ ఏ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in