ఎలుగుబంట్లకు పార్లేజీ బిస్కెట్లు తినిపించిన పూజారి.. వీడియో వైరల్
Actor ProfilePolitician

ఎలుగుబంట్లకు పార్లేజీ బిస్కెట్లు తినిపించిన పూజారి.. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎలుగుబంట్లకు పార్లేజీ బిస్కెట్లు తినిపించిన పూజారి.. వీడియో వైరల్
Zee Telugu24 Dec 2026
ఎలుగుబంట్లకు పార్లేజీ బిస్కెట్లు తినిపించిన పూజారి.. వీడియో వైరల్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Wild Bears Video Watch: ఆధారంగా అడవి జంతువులతో పాటు ముఖ్యంగా ఎరుగుబంట్లు వంటి క్రూర మృగాల పేర్లు వింటేనే భయంతో అందరూ ఎంతో వణికిపోతూ ఉంటారు. అలాంటిది.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక పూజారి ఏకంగా అడవి ఎలుగుబంటలకు చేతులతో పార్లేజీ బిస్కెట్లను తినిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక హనుమంతుడి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన అడవి ఎలుగుబంట్లకు పూజారి ఎలాంటి భయం లేకుండా అక్కడే కూర్చుని.. ఆ మూడింటికి పార్లేజీ బిస్కెట్లు చేతులతో తినిపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో రెండు ఎలుగుబంట్లు అతడు అందించిన బిస్కెట్లను అద్భుతంగా తింటున్నాయి. అంతేకాకుండా మరో చిన్న ఎలుగుబంటి మాత్రం.. ఆ పూజారి తలభాగం పైకి ఎక్కి.. అతను ఇచ్చిన బిస్కెట్ను తినడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. వాటికి ఆ పూజారి ఎంతో ఆప్యాయంగా బిస్కెట్లు పెట్టడం చూసిన చాలామంది.. ఆశ్చర్యపోతూ వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. అయితే, ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు సైతం.. సోషల్ మీడియా వినియోగదారులకు, అడవిలో జీవించే వారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు తెలుపుతున్నారు.. ఈ తరహా అలవాట్లు మూగజీవాలకే కాకుండా మానవాళికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు