
Independence Day| దిల్లీ: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజధాని దిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని (Vande Mataram) పూర్తిగా ఈ వేడుకల్లో ఆలపించారు. అనంతరం జాతీయ గీతం ‘జన గణ మన’ను ఆలపించారు. ఆ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని.. మరొకటి ‘వందేమాతరం’ అని రాసి ఉన్న జెండాను మోసుకెళ్లాయి. ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది నవంబర్ 7 నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ గీతం ‘జన గణ మన’తో పాటు వందేమాతరానికి ప్రభుత్వం సమాన హోదా కల్పిస్తూ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం.. ‘వందేమాతరం’ని (Vandemataram) అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు