ఎనిమిది మందితో ప్రేమాయణం... పెళ్లి కాకపోయినా తల్లినయ్యా.. షకీలా జీవితంలో ఇన్ని కష్టాలా
Actor ProfileActor

ఎనిమిది మందితో ప్రేమాయణం... పెళ్లి కాకపోయినా తల్లినయ్యా.. షకీలా జీవితంలో ఇన్ని కష్టాలా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎనిమిది మందితో ప్రేమాయణం... పెళ్లి కాకపోయినా తల్లినయ్యా.. షకీలా జీవితంలో ఇన్ని కష్టాలా
Samayam Telugu31 Oct 2026
ఎనిమిది మందితో ప్రేమాయణం... పెళ్లి కాకపోయినా తల్లినయ్యా.. షకీలా జీవితంలో ఇన్ని కష్టాలా

వెండితెరపై ఒకప్పుడు తన గ్లామర్‌తో, బోల్డ్ పాత్రలతో సంచలనం సృష్టించిన నటి షకీలా జీవితం వెనుక ఎన్నో గుండెల్ని పిండేసే కష్టాలు ఉన్నాయి. అప్పట్లో స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా తన సినిమాలతో థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టించిన ఈ శృంగార తార, వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్రమైన ఒంటరితనాన్ని, వంచనను ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న పలు ఆసక్తికర, భావోద్వేగ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిన్న వయసులోనే స్టార్‌డమ్‌తో పాటు జీవితంలోని చీకటి కోణాలను కూడా చూశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పేరిట ఆస్తులు దోచేశారుతను ఇంతవరకు వివాహం చేసుకోకపోవడానికి గల కారణాలను షకీలా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తన జీవితంలో దాదాపు ఏడెనిమిది మందితో ప్రేమాయణం సాగించినట్లు ఆమె బాహాటంగానే అంగీకరించారు. అయితే, ఆ ప్రేమించిన వారెవరూ తనను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదని, పైగా ప్రేమ పేరుతో నమ్మించి తన సంపాదనను, ఆస్తులను దోచుకున్నారని విచారం వ్యక్తం చేశారు. తాను బీ-గ్రేడ్ సినిమాల్లో నటించి రాత్రింబగళ్లు కష్టపడి సంపాదించిన డబ్బంతా కుటుంబం కోసమే తగలేశానని చెప్పారు. నాడు ఎవరి కోసమైతే అంతగా శ్రమించానో, ఈరోజు వారు ఎవరూ తన పక్కన లేరని, కేవలం డబ్బు ఉన్నప్పుడే మనుషులు చుట్టూ ఉంటారనే చేదు నిజం తనకు ఆలస్యంగా బోధపడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తినడానికి ఇబ్బంది లేకపోయినా, మానసికంగా ఒంటరినయ్యానని భావోద్వేగానికి లోనయ్యారు.* మహేష్ చిన్ననాటి పాత్రలో తారక్ తనయుడు?... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'వారణాసి' లీక్!23 ఏళ్లకే అన్నీ చూసేశా"నేను 23 ఏళ్ల ప్రాయంలోనే జీవితంలో చూడాల్సినవన్నీ చూసేశాను. చిన్న వయసులోనే విపరీతంగా సంపాదించి ఐదు కార్లు, ఇళ్లు కొన్నాను. కానీ అవన్నీ ఇప్పుడు లేవు. సాధారణ మహిళలాగే నాకు కూడా ఒక అందమైన కుటుంబం ఉండాలని, పిల్లలు నన్ను 'అమ్మ' అని పిలవాలని ఆశపడ్డాను. కానీ విధి