ఎన్నారైల
Actor ProfilePolitician

ఎన్నారైల

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources3
ఎన్నారైలపై ట్రంప్ సర్కార్ మరో కఠిన నిబంధన..! ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఆన్ లైన్ ఫైలింగ్ తప్పనిసరి
Telugu Times4 Dec 2026
ఎన్నారైలపై ట్రంప్ సర్కార్ మరో కఠిన నిబంధన..! ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఆన్ లైన్ ఫైలింగ్ తప్పనిసరి

వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్న అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో అస్త్రాన్ని బయటకు తీసింది. గ్రీన్‌కార్డ్‌, పౌరసత్వం, ఆశ్రయం వంటి ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది (Immigration Applications). త్వరితగతిన మెరుగైన సేవలు అందించేందుకు, నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఈ మేరకు కొత్త నిబంధనను ఫెడరల్‌ రిజస్టర్‌లో సోమవారం పబ్లిష్‌ చేసింది. గ్రీన్‌కార్డు దరఖాస్తులు, రెన్యువల్స్‌, ఫ్యామిలీ బేస్డ్‌ పిటిషన్లు, పౌరసత్వం కోసం, ఆశ్రయం కోసం చేసుకునే అభ్యర్థనలు, ఉపాధి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షిత హోదా ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఈ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే దరఖాస్తు దారులు యూఎస్‌సీఐఎస్‌ ఆన్‌లైన్ అకౌంట్‌ లేదా మెయిల్‌ (పోస్టు) ద్వారా పంపించే అవకాశం ఉంది. మరోవైపు.. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకున్న పెద్ద సంస్థలు ఆ ఉద్యోగుల హెచ్‌1బీ వీసా పొడిగింపునకు 4000 డాలర్లు, ఎల్‌1 వీసా పొడిగింపునకు 4500 డాలర్లు ఫీజు రూపంలో చెల్లించాలని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనల్ని ప్రకటించింది. ఇంతకు ముందు హెచ్‌1బీ, ఎల్‌1లకై తొలిసారి సమర్పించే దరఖాస్తులకు లేదా వీసాదారుడు ..ఉద్యోగం మారినప్పుడు మాత్రమే ఈ ఫీజు వర్తించేది. అమెరికాలో 50 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల్లో 50 శాతానికి మించి ఉద్యోగులు హెచ్‌1బీ లేదా ఎల్‌1 నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ స్థాయి కలిగి ఉంటే వారికి వర్తించే ‘‘9-11 రెస్పాన్స్‌ అండ్‌ బయోమెట్రిక్‌ ఎంట్రీ ఫీ’’ సెప్టెంబరు 9 నుంచి అమలులోకి వస్తుందని హోమ్‌ల్యాండ్‌ రక్షణ విభాగం పేర్కొంది. ఉద్యోగికి సంబంధించిన వీసా పొడిగింపునకు యథారీతిగా దరఖాస్తు చేసే సంస్థలు అందుకు అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

కేటీఆర్ సరికొత్త గ్లోబల్ ప్లాన్, దుబాయ్ వేదికగా భారీ ఈవెంట్
SkyC Media16 Nov 2026
కేటీఆర్ సరికొత్త గ్లోబల్ ప్లాన్, దుబాయ్ వేదికగా భారీ ఈవెంట్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును దుబాయ్‌కు చెందిన తెలంగాణ ఎన్నారైల ప్రతినిధి బృందం ఈరోజు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కలుసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ

హరీష్ రావుకు ఆటా ఆహ్వానం
Telugu Times2 Jun 2026
హరీష్ రావుకు ఆటా ఆహ్వానం

బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, హరీష్ రావును అమెరికా తెలుగుసంఘం (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ ఆటా

బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
Andhra Jyothy29 May 2026
బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్‌లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జయరాం కోమటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 100 మందికి పైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు. ఇంటర్నెట్ డెస్క్: బే ఏరియాలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతోపాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ నాయకులు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్ లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 100మందికిపైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ.. ఆయన చేసిన సేవలను, నటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడును ప్రారంభించిన సమయంలోనే ఇక్కడ కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందని జయరాం కోమటి చెప్పారు. మహానాడు రెండవరోజు కూడా మెయిన్ స్క్రీన్‌పై జయరాం కోమటి ఎన్నారైల భాగస్వామ్యంపై మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌తో కొన్ని సినిమాల్లో నటించిన ప్రముఖ రంగస్థల నటుడు అక్కిరాజు సుందరరామకృష్ణ పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. ఆయన ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. పౌరాణిక పద్యాలను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. 78 సంవత్సరాల వయసు ఉన్న ఆయన గతంలో జమునతో కలిసి శ్రీకృష్ణరాయబారం నాటకాలను వివిధ చోట్ల వేశారు. ఎన్నారై టీడీపీ

ఎన న ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in