ఎన్టీఆర్ వ్యక్తిత్వం
Actor ProfilePolitician

ఎన్టీఆర్ వ్యక్తిత్వం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఔన్నత్యం గొప్పవి
Chitrajyothy31 Oct 2026
ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఔన్నత్యం గొప్పవి

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా టి.డి. జనార్దన్ ఛైర్మన్ గా ప్రారంభమైన ఎన్టీఆర్ లిటరేచర్‌ కమిటీ నాలుగవ వార్షికోత్సవం శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరై అన్న ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'అన్న ఎన్ .టి . రామారావు తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత. తరతరాలు ఆయన భావజాలం కొనసాగుతుంది' అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్ .టి .ఆర్. లిటరేచర్ కమిటీ నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ లో శనివారం జరిగిన సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'తాను రామారావుగారి అభిమానంతో, ప్రోత్సాహంతో రాజకీయాల్లో ఎదిగానని, ఆయన వ్యక్తిత్వం, ఔన్నత్యం చాలా గొప్పదని, బడుగు, బలహీనవర్గాలతోపాటు వెనుకబడిన ప్రజలకు కూడా రాజకీయంగా చేయూతనిచ్చిన మహానాయకుడు రామారావుగార'ని చెప్పారు. ఎన్టీఆర్ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేయటానికి టి.డి. జనార్థన్ నాయకత్వంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటుకావటం ఎంతో సముచితంగా ఉందని, ఆ మహనీయుని చరిత్ర ఎప్పటికీ స్ఫూర్తినిస్తూంటుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ మాజీ శాసనసభాదిపతి ఎమ్. మధుసూదనాచారి మాట్లాడుతూ, 'రాజ్యాధికారం లేని ఎన్నో కులాలను గుర్తించి వారికి సముచితమైన స్థానం ప్రసాదించిన ఆరాధ్యనాయకుడు ఎన్టీఆర్ అని, తాను ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ను తలవకుండా ఉండలేనని, ఎన్టీఆర్ తన అణువణువులో ఉన్నార'ని పేర్కొన్నారు. తమ కులానికి రాజ్యాధికారం కల్పించిన నాయకుడిగా ఎన్టీఆర్ ను తానెప్పుడూ గౌరవిస్తానని, పేద ప్రజల ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన ప్రశంసింశారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ, రామారావు గారి శతజయంతి సందర్భంగా ఆయన చరిత్రను ముందు తరాలకు ఆనందజెయ్యాలని ఈ కమిటీ ఏర్పడింది. మా లిటరేచర్ కమిటీ ప్రారంభమై ఇప్పటికి నాలుగేళ్లవుతోంది. అసెంబ్లీ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు

ఎన ట ఆర వ యక త త వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in