
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Jr NTR Political Entry News: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఓ కీలక ప్రకటన చేసింది. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అంటూ కొన్ని రోజులుగా జరిగిన ప్రచారానికి ఈ ప్రకటనతో బ్రేక్ వేసినట్లు అయ్యింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాతో పాటు వార్తా సంస్థల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ అభిమానులు విడుదల చేసిన లేఖ ప్రకారం.. జూలై 18న నిర్వహించనున్న కార్యక్రమం పేరు 'ఊరు-వాడ' అంటూ శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశం అనే వార్తలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. కేవలం సామాజిక కార్యక్రమమే! ఈ లేఖలో అభిమానుల సంఘం ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. 'ఊరు-వాడ' అనేది ఎప్పుడో ప్లాన్ చేసిన ఒక సామాజిక సేవా కార్యక్రమం మాత్రమే. ఇలాంటి సేవా కార్యక్రమాలను రాజకీయాలతో ముడిపెట్టి అభిమానులను అయోమయానికి గురిచేయవద్దని కోరారు. ఎలాంటి ఆధారాలు లేని అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాటిని ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలను, సోషల్ మీడియా పేజీలను విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి అభిమానుల సంఘం క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో పొలిటికల్ హీట్.. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సాధించిన ఘన