
Oneindia Telugu•26 Nov 2026
ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అమిత్ షా..! ఒత్తిడికి తలొగ్గి కీలక నిర్ణయంనీట్ అక్రమాలపై ఢిల్లీలో నిరసనలకు దిగిన విద్యార్దులపై పోలీసుల దాడులపై ఇప్పటివరకూ పార్లమెంట్ కు వచ్చి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. ముప్పేట దాడి నేపథ్యంలో వెనక్కి తగ్గారు. అమిత్ షాను ఎలాగైనా పార్లమెంట్ కు రప్పించాలని విపక్షాలు పార్లమెంట్ ఉభయసభల్ని స్తంభింపచేస్తున్న వేళ.. ఎట్టకేలకు అమిత్ షా తన నిర్ణయం మార్చుకున్నారు. పార్లమెంట్ కు హాజరై ఢిల్లీ పోలీసుల దాడులపై సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు