
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భూ యజమానులు వేచి చూస్తున్న కీలక సమస్యను పరిష్కరించేందుకు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు స్పష్టత ఇస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటన చేసారు. నిషేధిత జాబితా నుంచి అర్హత ఉన్న భూములను తప్పించి.. వాటి యాజమానులకు పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయించారు.తెలంగాణలో సుదీర్ఘ కాలంగా కొందరు భూ యజమానులు వేచి చూస్తున్న పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో 22ఏ జాబితాలో భూములు ఉండటంతో వాటిని విక్రయించలేక, రిజిస్ట్రేషన్లు చేసుకోలేక కొందరు భూ యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకు రుణాలు పొందడంలోనూ వారికి సమస్యలు ఎదుర్కొంటు న్నారు. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తెలిగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేసిన తరువాత.. అర్హత ఉన్న వాటిని జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93 లక్షల ఎకరాల భూములు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.శ్రీవారి భక్తులకు అరుదైన అద్భుత అవకాశం- మళ్లీ దక్కేనా..!!ఫిర్యాదుల పరిశీలనకు నిర్ణయంకాగా.. ఇందులో సుమారు 66 లక్షల ఎకరాలు అటవీ భూములు, 24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములతోపాటు దేవాదాయ తదితర కేటగిరీల భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. కొన్ని ప్రైవేటు భూములు కూడా 22ఏ జాబితాలోకి వెళ్లడంతో వాటి యజమానులు ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే రికార్డుల్లో జరిగిన పొరపాట్లు, గతంలో చేపట్టిన సర్వేల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇలా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రత్యేకించి గ్రేటర్ పరిధిలో..