ఎక్కడ సర్ ’.. మీ చిరునామా
Actor ProfilePolitician

ఎక్కడ సర్ ’.. మీ చిరునామా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎక్కడ సర్ ’.. మీ చిరునామా
Andhra Jyothy19 Oct 2026
ఎక్కడ సర్ ’.. మీ చిరునామా

అడ్రస్‌ తెలియక.. ఫోన్లు ఎత్తక.. సతమతమవుతున్న బీఎల్‌ఓలు తెలిసిన నియోజకవర్గం కాకుండా వేరే చోట విధులు ఓటరు నమోదు ప్రక్రియలో తీవ్ర ఇబ్బందులు ఇళ్లకు వెళ్లినా.. సహకరించని కొందరు ఓటర్లు ఫారాలు నింపలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి 2002 సంవత్సరం నాటి ఓటు వివరాలే పెద్ద సమస్య - అంబర్‌పేటకు చెందిన మహిళ ఓ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఆమెను బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ)గా నియమించారు. యూసు్‌ఫగూడ పరిధిలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటరు ఫారాల పంపిణీ బాధ్యతను అప్పగించారు. తాను ఉండేది అంబర్‌పేటలోనని, గతంలో అక్కడ బీఎల్‌ఓగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పినప్పటికీ, అధికారులు బలవంతంగా యూస్‌ఫగూడకు పంపించారు. ఆమెకు సాయంగా మరో ఇద్దరిని నియమించారు. కాగా, ఫారాల పంపిణీకోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లిన అనంతరం సహాయకులు పలు కారణాలు చెబుతూ విధులకు రావడం లేదు. 12 రోజులు గడుస్తున్నా ఆమె తనకు కేటాయించిన 882 మంది ఓటర్లలో ఇప్పటివరకు 422 మందికి మాత్రమే ఫారాలు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయడం మొదలుకుని వాటిని తిరిగి సేకరించడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వరకు అన్నింటా సతమతమవుతున్నారు. ఓటర్ల చిరునామాలు దొరకక, స్థానికంగా సహకారం లభించక పరేషాన్‌ అవుతున్నారు. దీంతో పాటు బీఎల్‌ఓలకు సాయంగా ఉండేందుకు నియమించిన వారిలో సగం మంది విధులు హాజరుకాకపోవడంతో బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో నిర్ణయించిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు. ప్రహసనంగా ప్రక్రియ మహానగరంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ బీఎల్‌ఓలకు ప్రహసనంగా మారింది. ఎన్యుమరేషన్‌ ఫారం ఇచ్చేందుకు వెళ్తున్న ఒక్కో బీఎల్‌ఓకు ఒక్కో విధమైన అనుభవం ఎదురవుతోంది. తమకిచ్చిన కిట్‌తో పాటు ఎన్యూమరేషన్‌ పత్రాల కట్టలను మోసుకుని ఇంటింటికీ తిరగలేకపోతున్నారు. ఒక్కొక్కరు దాదాపు

ఎక కడ సర మ చ ర న మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in