ఎక్కడ చూసినా నాగ్ నామ జపమే.. ఇంత యాక్టివ్ అయ్యారేంటి
Actor ProfileCelebrity

ఎక్కడ చూసినా నాగ్ నామ జపమే.. ఇంత యాక్టివ్ అయ్యారేంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎక్కడ చూసినా నాగ్ నామ జపమే.. ఇంత యాక్టివ్ అయ్యారేంటి
Chitrajyothy18 Dec 2026
ఎక్కడ చూసినా నాగ్ నామ జపమే.. ఇంత యాక్టివ్ అయ్యారేంటి

‘లెనిన్’ సక్సెస్, అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా విడుదలవుతోన్న ‘పళ్ళబురుసు’ వంటి సినిమా ఈవెంట్స్‌తో పాటు.. ఇప్పుడో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. కింగ్ నాగ్ వార్తలలో హైలెట్ అవుతున్నారు. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా కింగ్ నాగార్జున (King Nagarjuna) పేరే వినిపిస్తోంది. ‘లెనిన్’ సక్సెస్, అన్నపూర్ణ స్టూడియోస్‌ ద్వారా విడుదలవుతోన్న ‘పళ్ళబురుసు’ వంటి సినిమా ఈవెంట్స్‌తో పాటు.. ఇప్పుడో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. కింగ్ నాగ్ వార్తలలో హైలెట్ అవుతున్నారు. సినిమా ఈవెంట్స్‌తో, ‘కింగ్ 100’ షూట్‌తో బిజీగా ఉన్న నాగార్జున.. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన బ్రాండ్ ఏమిటో తెలుసా? ‘కాప్స్టన్’ హోమ్ సర్వీసెస్ బ్రాండ్‌‌కు అంబాసిడర్‌గా కింగ్ నాగార్జున ఎన్నికయ్యారు. గత రెండు దశాబ్దాలుగా B2B సేవల రంగంలో నమ్మకమైన మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న ప్రముఖ ‘కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్’, తన అనుబంధ సంస్థ ద్వారా హైదరాబాద్‌లో ‘కాప్స్టన్ హోమ్ సర్వీసెస్’ యాప్‌ను ప్రారంభించి అధికారికంగా ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ గ్రాండ్ యాప్ లాంచ్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై, యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాప్స్టన్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ సీ.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి, సీనియర్ నాయకత్వ బృందం, ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “ఒక కస్టమర్ ఇంట్లోకి వచ్చే ప్రతి సేవ కూడా నమ్మకంపై ఆధారపడి ఉండాలి. గత రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలకు మానవ వనరుల పరిష్కారాలను అందిస్తూ కాప్స్టన్ ఆ నమ్మకాన్ని సంపాదించుకుంది. అదే ప్రొఫెషనలిజం, పారదర్శకత, నాణ్యతను ప్రతి ఇంటికీ అందించాలనే వారి దృక్పథం నన్ను ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం కావడానికి ప్రేరేపించింది. కాప్స్టన్ ప్రయాణంలో భాగస్వామి కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన హోమ్ సర్వీసెస్ బ్రాండ్లలో ఒకటిగా ఎదగడమే మా లక్ష్యమని తెలిపారు

ఎక కడ చ స న న గ న మ జపమ ఇ త య క ట వ అయ య ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in