ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది!
Actor ProfileActor

ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema17 Nov 2026
ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చింది! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) నిన్న ప్రీమియర్ షోలతోనే హంగామా స్టార్ట్ చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం చాలా చోట్లా ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. దాంతో టీం ఆనందంగా సెలెబ్రేట్ చేసుకొంది. “నిన్న సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది,” అని వరుణ్ తేజ్ అన్నారు. “సత్య కామెడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రానున్న రోజుల్లో సినిమా ఇంకా గొప్ప ముందుకు వెళ్తుంది. శిరీష్ గారు ఎడిటింగ్ దశలోనే సినిమా చూసి, ‘మీరు మంచి సినిమాతో వస్తున్నారు’ అని మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకం ఈరోజు నిజమైంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది,” అని వరుణ్ తేజ్ ఆనందం వ్యక్తం చేశారు. “మొదటి నుంచి వరుణ్ తేజ్ ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలబడి ప్రతి విషయంలో అండగా ఉన్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ సినిమాతో చూడడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్ గారి కటౌట్‌కు తగ్గ సినిమా ఇది,” అని దర్శకుడు అన్నారు. నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పింది బ్యూటీ హీరోయిన్ రితిక నాయక్

ఊహ చ న ద న క ట మ చ ర స ప న స వచ చ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in