
West Indies World Cup 2027 Qualification: రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. 2027 వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని విండీస్ కోల్పోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వెనుకబడటంతో ఇక క్వాలిఫైయర్ పోరు ద్వారానే టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంది. గత పరాభవాల నుంచి పాఠాలు నేర్వని విండీస్ అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది. ప్రపంచ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే వెస్టిండీస్ జట్టుది ఎవరికీ అందని ప్రత్యేకమైన చరిత్ర. 1975, 1979లలో వరుసగా తొలి రెండు ప్రపంచకప్ ట్రోఫీలను ముద్దాడిన కరీబియన్ దిగ్గజాలు, రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుని తమ సత్తా చాటారు. అలాంటి అగ్రశ్రేణి జట్టు నేడు 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఐసీసీ ప్రకటించిన నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచే జట్లతో పాటు ఆతిథ్య దేశాలు మాత్రమే నేరుగా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందుతాయి. ఎక్కువమంది చదివింది: Video: 6,6,6,6,4.. 15 బంతుల్లో బీభత్సం.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే ఇచ్చిపడేసిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్! అయితే, బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆఫ్ఘనిస్థాన్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏకైక విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. దీంతో కరీబియన్ జట్టు పదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో పాటు ఆతిథ్య హోదా కలిగిన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ ముందంజ వేయడంతో వెస్టిండీస్ ఆశలు ఆవిరైపోయాయి. ముందుగా నిర్ణయించిన కటాఫ్ తేదీ కంటే ముందు వెస్టిండీస్ జట్టు టీమిండియాతో రెండు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడాల్సి ఉంది. అయితే ఒకవేళ వెస్టిండీస్ ఈ