
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Government School: ఒకప్పుడు ఆ బడి పిల్లల కేరింతలతో కళకళలాడింది. కానీ.. కాలక్రమేణా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల రంగుల ప్రపంచం ముందు ఆ సర్కారు బడి వెలవెలబోయింది. అడ్మిషన్లు తగ్గిపోయి మూతపడే స్థితికి చేరుకుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే చేతులెత్తేసే సమాజంలో.. ఆ ఊరి జనం మాత్రం చరిత్రను తిరగరాశారు. మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం.. వేల రూపాయల ప్రైవేట్ ఫీజుల భారం నుంచి మనల్ని మనం ముక్తం చేసుకుందాం అంటూ ఊరంతా ఒక్కతాటిపైకి వచ్చింది. ఫలితంగా.. ఈరోజు ఆ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ బళ్లకు సవాల్ విసురుతూ.. రికార్డు స్థాయి అడ్మిషన్లతో తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం.. విద్యా కమిటీ ఏర్పాటు: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలోని ప్రీ-ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ స్కూళ్ల ప్రభావంతో విద్యార్థులను కోల్పోసాగింది. ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు అత్యవసరంగా సమావేశమయ్యారు. వేల రూపాయలు పోసి ప్రైవేట్ స్కూళ్లకు పంపడం కంటే, పైసా ఖర్చు లేకుండా మన బడిలోనే కార్పొరేట్ స్థాయి చదువు ఎందుకు అందించకూడదు? అనే ఆలోచన వారిలో మొదలైంది. వెంటనే గ్రామస్తులంతా కలిసి ఒక విద్యాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ బడికే పంపాలని, అందుకు తగ్గట్టుగా స్కూల్‌ను బలోపేతం చేయాలని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే, తీర్మానం చేస్తే సరిపోదు.. బడిలో నాణ్యమైన బోధన, వసతులు ఉండాలని భావించారు. రంగంలోకి టీచర్లు.. 100శాతం ఫలితాల మ్యాజిక్: గ్రామస్తుల పట్టుదలకు పాఠశాలలోని 15 మంది ఉపాధ్యాయుల కష్టం తోడైంది