
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. zoom call layoff: నేనే బాస్ నన్నేవడూ పీకలేడు అని విర్రవీగితే.. విశాల్ గార్గ్ కు పట్టిన గతే పడుతుంది. ఆన్ లైన్ మోర్టిగేజ్ సంస్థ Better.comకు చెందిన 900 మంది ఉద్యోగులను ఒక్క జూమ్ కాల్ తో తొలగించేశారు. 2021లో భారత సంతతికి చెందిన సీఈవో విశాల్ గార్గ్ 900 మంది ఉద్యోగులను ఒకే ఒక దెబ్బతో తొలగించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే మరోసారి విశాల్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అప్పట్లో 900 మందికి పీకిపడేసిన విశాల్ ఇప్పుడు తన ఉద్యోగం కోల్పోయాడు. తాజాగా తన సీఈవో జాబ్ నుంచి తొలగించిన తర్వాత తిరిగి తీసకోవాలని సంస్థ బోర్డును వేడుకుంటున్నాడు. Better.com వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అయిన గార్గ్ ను ఆగస్టు 3న సీఈవో పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో డేనియల్ లూయిస్ ను కొత్త సీఈవోగా నియమించారు. విశాల్ గార్గ్ ఆరోపిస్తుంది ఏంటంటే.. డేనియల్ లూయిస్ తొలత సంస్థ వ్యూహం పై ఆసక్తి చూపిస్తూ.. తన విశ్వాసాన్ని పొందారు. ఖర్చులను తగ్గించడం, కంపెనీ లాభదాయకంగా మార్చడం వంటి అంశాలపై 6 నెలల క్రితం గార్గ్ తో చర్చలు జరిపారు. అయితే చివరికి బోర్డులోకి ప్రవేశించి.. ఇతర డైరెక్టర్ల విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. తనను సీఈవో పదవి నుంచి తప్పించారని గార్గ్ ఆరోపణలు చేశారు. లూయిస్ ఖర్చు తగ్గింపుపై చేసిన ఆలోచనలు బాగానే ఉన్నాయి..కానీ ఆయన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలు అంతగా నచ్చలేదని గార్గ్ చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. జూలై 27న లూయిస్ ను కంపెనీ బోర్డులోకి తీసుకున్న కేవలం వారం రోజుల్లోనే ఇతర డైరెక్టర్లను ఒప్పించి విశాల్ గార్గ్ ను