ఉద్యోగం కోసం కన్నతల్లి హత్య
Actor ProfilePolitician

ఉద్యోగం కోసం కన్నతల్లి హత్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్యోగం కోసం కన్నతల్లి హత్య
Eenadu7 Oct 2026
ఉద్యోగం కోసం కన్నతల్లి హత్య

జైపుర్‌: తండ్రి మరణానంతరం ప్రభుత్వం ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగాన్ని తల్లి తీసేసుకుందనే కక్షతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కాలన్న దుర్బుద్ధితో ఒక యువతి అత్యంత దారుణానికి పాల్పడింది. కన్నతల్లి హత్యకు కుట్రపన్ని దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయింది. రాజస్థాన్‌లోని ప్రతాప్‌నగర్‌లో ఈ నెల 23న రవీంద్రనగర్‌కు చెందిన నీరజ్‌ శర్మ(45) కారు ఢీకొనడంతో మృతి చెందారు. ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె సోదరుడు రాకేశ్‌ ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం భర్త మరణించగా...కారుణ్య నియామకం కింద కోర్టులో ఎల్‌డీసీగా నీరజ్‌ శర్మ ఉద్యోగం పొందారు. ఆ ఉద్యోగం తనకు దక్కాలని కుమార్తె ఆయుషి ఆశించింది. తల్లి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించింది. దీంతో పాటు కుటుంబ ఆస్తిని కూడా దక్కించుకునేందుకు తమ సమీప బంధువులు ఆరుగురితో కలిసి కుట్రపన్నింది. దర్యాప్తులో కుట్రను ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారని డీసీపీ రంజిత్‌ శర్మ వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు