
ఘంటసాల: విద్య, వైద్య, స్వయం ఉపాధి రంగాల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ వంటి అనేక సామాజిక సేవలు అందిస్తున్న పురిటిగడ్డకు చెందిన ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ వేములపల్లి సురేష్ - రోజా దంపతులకు ‘ఉత్తమ సమాజ సేవకులు’ అవార్డు అందుకున్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి. నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చేతులమీదుగా అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు