ఉజ్బెకిస్థాన్ లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. బలవంతపు మతమార్పిడి కోణంలోనూ ఆరోపణలు
Actor ProfilePolitician

ఉజ్బెకిస్థాన్ లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. బలవంతపు మతమార్పిడి కోణంలోనూ ఆరోపణలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉజ్బెకిస్థాన్ లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. బలవంతపు మతమార్పిడి కోణంలోనూ ఆరోపణలు
AP7AM26 Oct 2026
ఉజ్బెకిస్థాన్ లో కేరళ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. బలవంతపు మతమార్పిడి కోణంలోనూ ఆరోపణలు

ఉజ్బెకిస్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న 22 ఏళ్ల సవారియా బసంత్ కేరళ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సదరు యువతిని అత్యంత దారుణంగా హింసించి హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేరళ పోలీసులు 'హత్య' కేసు నమోదు చేశారు. ఈ ఘోరం ఉజ్బెకిస్థాన్‌లో జరిగినప్పటికీ, భారతీయ చట్టాల ప్రకారం ఇక్కడ కేసు నమోదు చేసేందుకు వీలుందని కాయంకుళం డీఎస్పీ బినుకుమార్ స్పష్టం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఆలప్పుళ జిల్లా పోలీస్ చీఫ్‌ను ఆశ్రయించడంతో, హరిపాడ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆలప్పుళ మెడికల్ కాలేజీలో మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారు. ఒకవేళ ఉజ్బెకిస్థాన్‌ పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షిస్తే ఇక్కడ కేసు క్లోజ్ చేస్తామని, లేదంటే భారత చట్టాల ప్రకారం ముందుకెళ్తామని అధికారులు తెలిపారు. నిందితుడు సదారుల్ అనామ్ మలప్పురానికి చెందిన సహ విద్యార్థి అని, గొడవ జరిగే క్రమంలో లాప్‌టాప్‌తో తలపై కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని తొలుత ప్రచారం జరిగింది. కానీ, బాధితురాలి కుటుంబం దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. మృతదేహంపై అనేక చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నాయని, చంపే ముందు ఆమెను గంటల తరబడి దారుణంగా హింసించారని ఉజ్బెకిస్థాన్‌ వెళ్లిన ఆమె బంధువు తెలిపారు. నిందితుడు సదరు విద్యార్థినిని మతం మారాలంటూ కొంతకాలంగా తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు అక్కడ చదువుతున్న తోటి విద్యార్థులు సాక్ష్యం చెప్పారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు, అన్న డాక్టర్ కావడం వల్ల కేసును తారుమారు చేసే అవకాశం ఉందంటున్నారు. అందుకే నిందితుడిని భారత్‌కు రప్పించి ఇక్కడే విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ఉజ్బెకిస్థాన్‌ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు సేకరించేందుకు కేరళ పోలీసులు ఇండియన్ ఎంబసీ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఉజ్బెకిస్థాన్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు

ఉజ బ క స థ న ల క రళ వ ద య వ ద య ర థ న ద ర ణ హత య బలవ తప మతమ ర ప డ క ణ ల న ఆర పణల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in