
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమర అస్తమిస్తాడు.. ఇది మనకు తెలిసిన విషయమే. అందుకే.. ఎప్పుడైనా.. ట్రిప్ కోసం హిల్ స్టేషన్స్ కి వెళ్లినప్పుడు.. ఆ కొండపైకి ఎక్కి మరీ.. సన్ రైజ్, సన్ సెట్ రెండూ


సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమర అస్తమిస్తాడు.. ఇది మనకు తెలిసిన విషయమే. అందుకే.. ఎప్పుడైనా.. ట్రిప్ కోసం హిల్ స్టేషన్స్ కి వెళ్లినప్పుడు.. ఆ కొండపైకి ఎక్కి మరీ.. సన్ రైజ్, సన్ సెట్ రెండూ

బిజీ బిజీ లైఫ్.. ట్రాఫిక్ రద్దీలు.. ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవితం బోర్ కొట్టిందా..? అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఉంది. చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా భూతల స్వర్గాన్ని తలపించే వాతావరణం ఇక్కడి ప్రాంతం సొంతం. అవే తెలంగాణలోని అనంతగిరి కొండలు.. హైదరాబాద్ కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే వికారాబాద్ జిల్లాలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. ఈ ప్రాంతం తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి ప్రేమికులకు.. వీకెండ్ ట్రిప్స్ కు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది. వికారాబాద్ లోని అనంతగిరి హిల్ స్టేషన్ లో అనేక ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి. వాటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. అలాగే ట్రెక్కింగ్, సాహసాలకు అనంతగిరి హిల్స్ కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాయి.దట్టమైన అడవి మధ్యలో ట్రెక్కింగ్ చేసేందుకు అనంతగిరి హిల్స్ అనుకూలంగా ఉంటాయి. అడవి మధ్యలో నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ కొండల నుంచే మూసీ నది పుట్టి హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు నీటిని అందిస్తుంది. అనంతగిరి కొండల మొత్తం విస్తీర్ణం దాదాపు 3,763 ఎకరాలుగా ఉంది. వికారాబాద్ టౌన్ కు ఈ కొండలు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అనంతగిరి ప్రాంతంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక పర్యాటక జోన్ రూపుదిద్దుకుంది. బర్డ్ వాచ్ సెంటర్, వ్యూ పాయింట్లు, ట్రెక్కింగ్ మార్గాలు, నేచర్ వాక్స్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే కట్టుదిట్టమైన భద్రత, పార్కింగ్ సౌకర్యాలు, పర్యాటక సమాచార కేంద్రాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పిల్లల కోసం థీమ్ పార్కులు, వెల్ నెస్ సెంటర్లు, పర్యావరణ అనుకూల రిసార్టులు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.ఇక

ఆంధ్రప్రదేశ్‌లో మంచు కురిసే ప్రాంతం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం. సౌత్ ఇండియాలోనే చలికాలంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏకైక ప్రాంతం మన లంబసింగి. అందుకే ఈ ప్రాంతాన్ని