
పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే తీశారు. ఆగస్టు 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే దీనిలో కథ, యాక్షన్, స్టార్ నటీనటుల కంటే హింస, శృంగార కంటెంట్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విడుదలైన "తబాహీ" వీడియో సాంగ్ ఆ చర్చ మరింత ముదిరేలా చేసింది. (ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నాలుగేళ్లు నా వెంటపడ్డాడు: హీరోయిన్ అంజలి) టాక్సిక్ మొదటి టీజర్ విడుదలైనప్పటి నుంచే దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌పై విమర్శలు వస్తున్నాయి. టీజర్‌లో హింస, రక్తపాతం, శృంగార సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హింస ఉండటం కొత్తేమీ కాదు. అయితే టాక్సిక్‌లో హింసను చూపించిన తీరు, దానికి తోడు గ్లామర్‌ని మిళితం చేసిన విధానం చర్చకు దారితీసింది. ఆ తర్వాత మహిళా తారాగణాన్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక వీడియో కూడా ఇదే తరహా విమర్శలను ఎదుర్కొంది. పాత్రల పరిచయం కంటే స్టైలిష్ విజువల్స్, సెక్సువల్ టోన్, డార్క్ ప్రెజెంటేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సినీ అభిమానుల్లో కొందరు అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదలైన "తబాహీ" వీడియో సాంగ్ ఈ చర్చను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలో యాక్షన్‌తో పాటు శృంగార సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండటంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సినిమా కథకు తగ్గ ప్రెజెంటేషన్‌గా సమర్థిస్తుంటే, మరికొందరు అవసరానికి మించి రెచ్చగొట్టే విజువల్స్‌ను ఉపయోగించారని విమర్శిస్తున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి) పాటలో కనిపించిన కియారా అద్వానీపైనా సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. పెళ్లయి, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తుండగా, వ్యక్తిగత జీవితం, నటిగా చేసే పాత్రలను కలిపి చూడకూడదని మరికొందరు అంటున్నారు. నటీనటులు తమ పాత్రల ప్రకారం