
ప్రస్తుతం కోలీవుడ్‌లో త్రిష పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోయింది. ఇటీవల మరోసారి త్రిష పేరు తెరమీదకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వివాద జరిగిన దాదాపు వారం రోజులవుతోంది. తాజాగా ఈ కాంట్రవర్సీపై హీరోయిన్ త్రిష తనదైన శైలిలో కౌంటరిచ్చింది. నేరుగా ఉదయనిధి పేరు ప్రస్తావించకుండానే గట్టిగానే ఇచ్చిపడేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటు. వెళ్లి కొంత డబ్బు సంపాదించు, మనశ్శాంతిని పొందు' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్ చేసి ఆయనను విచారించిన తర్వాత పోలీసులు విడుదల చేశారు. తంజావూరుకు తీసుకెళ్లి గంటకుపైగా పోలీసులు విచారించారు. అంతకుముందు మద్రాస్ హైకోర్టు.. దర్యాప్తునకు అవసరమైనప్పుడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. విచారణ పూర్తైన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులకు సూచించింది. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?