
మాజీ ప్రియురాలిపై ఛాట్ జీపీటీతో వ్యక్తి సంభాషణ మాజీ ప్రియురాలిని చంపేస్తానంటూ ఛాట్‌జీపీటీతో జరిపిన సంభాషణ అమెరికాకు చెందిన డారెన్ ఝా అనే వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. బ్రేకప్ తరువాత మాజీ ప్రేయసిపై అక్కసునంతా ఛాట్‌జీపీటీలో వెళ్లగక్కుకున్న డారెన్ ‘‘ఈ నేలాఖరులోగా ఆమెను చంపేస్తా’’. ‘‘నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు’’లాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడంతో ఆ సంభాషణ మొత్తాన్ని ఛాట్‌జీపీటీ యజమాని ఓపెన్ ఏఐ ఎఫ్‌బీఐకి ఇచ్చేసింది. దీంతో అతడిపై కేసు నమోదైంది. శిక్ష కూడా పడింది. వివరాలు... పాతికేళ్ల వయసున్న డారెన్ ఝూ అమెరికాలోని ఫ్లారిడా వాసి.నాలుగైదు నెలల క్రితం ఛాట్‌జీపీటీ వాడటం మొదలుపెట్టారు. గర్ల్‌ఫ్రెండ్‌తో తెగతెంపులై కొంత సమయమే అయ్యింది. మొదట్లో బ్రేకప్ గురించి, మాజీ ప్రేయసి ఇష్టాఇష్టాల గురించి ఛాట్‌జీపీటీపై వాకబు చేశాడు. ఆమె ఎక్కడెక్కడ తిరిగేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ప్రేమను మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు అనుకుందో ఏమో... ఛాట్‌జీపీటీ కూడా అతడి ప్రశ్నలకు తగ్గ సమాధానాలిచ్చింది. అయితే రాను రాను డారెన్ మాటలు దారితప్పడం మొదలైంది. మానభంగం, హత్య, ఆత్మహత్యలపైకి మళ్లింది. ఒక మెసేజ్‌లో డారెన్ టిపికల్ భగ్న ప్రేమికుడి టైప్‌లో... ‘‘ఆమె నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్క కూడదు’’, ‘‘ఈ నెలాఖరుకు ఆమెను చంపేస్తా’’అని ఛాట్‌జీపీటీతో చెప్పినట్లు అధికారులు గుర్తించారు. అక్కడితో ఆగిపోయినా బాగుండేది. కానీ ఆ అమ్మాయి వెళ్లే జిమ్ వద్ద తాను పూలబోకేతో వేచి చూశానని, నన్ను కాదంటే అంతే అంటూ బెదిరించేందుకు సిద్ధమయ్యానని కూడా డారెన్ ఛాట్‌జీపటీతో చెప్పుకున్నట్లు తెలిసింది. మరికొన్ని మెసేజీల్లోనైతే తుపాకితో బెదిరించి ఇంట్లోకి జొరబడాలని, ఆపై లైంగిక దాడికి పాల్పడాలని కూడా ప్లాన్ చేశాడట. తన వద్ద ఏఆర్–15 రకం రైఫిల్, గ్లాక్ హ్యాండ్ గన్, 12–గేజ్ షాట్‌గన్‌లు కూడా ఉన్నట్లు, వీటి ఫొటోలతోపాటు, రబ్బరు గ్లౌవ్స్, జిప్‌టైల ఫొటోలు కూడా మాజీ ప్రియురాలికి పంపినట్లు డారెన్ ఛాట్‌జీపీటీతో పంచుకున్నాడు. ‘‘ఆమెకు టెక్స్‌ట్ చేశా