ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న
Actor ProfileActor

ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema25 Sept 2026
ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన “లెనిన్” (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) నిర్మించారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. “నందు ఈ కథ శ్రీరామపురం నేపథ్యంలో జరుగుతుందని మొదట చెప్పాడు. మా నాన్నగారు కూడా శ్రీరామపురం అనే ఊరిలోనే జన్మించారు. అందుకే ఈ కథతో నాకు మొదటి నుంచే ఒక అనుబంధం ఏర్పడింది. నందు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన కోణం ఉంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయి… యుద్ధాలు జరిగాయి. ‘లెనిన్’లో కూడా అలాంటి బలమైన ప్రేమకథ ఉంది. భారతి పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయాలనిపిస్తుంది. ఈ సినిమాకు భారతి పాత్రే హార్ట్‌బీట్‌లాంటిది,” అని నాగార్జున అన్నారు. “చింటు అన్న (నాగవంశీ)కి మాస్ పల్స్ బాగా తెలుసు (నవ్వుతూ). ఈ సినిమాపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి, ఏపీ మొత్తం ఆయనే స్వయంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ‘లెనిన్’ అనేది సీమ కథ… సీమ మట్టి కథ… అక్కడి మనుషుల కథ… సీమలో జరుగుతున్న మహాభారతం,” అని నాగార్జున ధీమాగా చెప్పారు. “మొదట్లో అఖిల్ ఈ పాత్రకు సరిపోతాడా? అనే సందేహం నాకు కూడా వచ్చింది. కానీ సినిమా చూసిన తర్వాత ఆ సందేహం పూర్తిగా పోయింది. తెరపై అఖిల్ కనిపించడు… ‘లెనిన్’ మాత్రమే కనిపిస్తాడు. ప్రేక్షకులు లెనిన్ ప్రేమను, అతని పగను కూడా ప్రేమిస్తారు. ఆ పాత్రను తమ హృదయాల్లోకి తీసుకెళ్తారు. మనందరికీ వెంకటేశ్వర స్వామి ఎంత గొప్ప దేవుడో… అలాగే ఈ ప్రేక్షకులే

ఈస ర తన క డ క హ ట క డ త డ అ ట న న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in