ఈవారం నాలుగు స్ట్రయిట్... మూడు డబ్బింగ్
Actor ProfileActor

ఈవారం నాలుగు స్ట్రయిట్... మూడు డబ్బింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈవారం నాలుగు స్ట్రయిట్... మూడు డబ్బింగ్
Chitrajyothy15 Dec 2026
ఈవారం నాలుగు స్ట్రయిట్... మూడు డబ్బింగ్

ఈ వీకెండ్ లో ఏడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులో నాలుగు స్ట్రయిట్ సినిమాలు కాగా మూడు అనువాద చిత్రాలు. ఆగస్ట్ సెకండ్ వీకెండ్ థియేటర్లలో స్ట్రయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్‌ సినిమాలు సైతం సందడి చేయబోతున్నాయి. నాలుగు డైరెక్ట్ తెలుగు సినిమాలు వస్తుంటే, వాటికి దీటుగా మూడు అనువాద చిత్రాలు రాబోతున్నాయి. సూర్య హీరోగా సితార ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' అందులో ఒకటి. మరొకటి ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో స్వర్గీయ ఆర్.బి. చౌదరి నిర్మించిన 'మకుటం'. ఈ మూవీ కోసం తొలిసారి హీరో విశాల్ దర్శకుడి అవతారమెత్తాడు. ఈ రెండు అనువాద చిత్రాలతో పాటే ఇంగ్లీష్‌ సినిమా 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్' తెలుగులో వస్తోంది. శుక్రవారం వస్తున్న సినిమాల్లో అందరూ దృష్టి సూర్య 'విశ్వనాథ్‌ అండ్ సన్స్' మీదనే ఎక్కువగా ఉంది. గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమౌతున్న సూర్యకు ఈ యేడాది 'కరుప్పు8 రూపంలో మంచి విజయం లభించింది. ఆ వెనుకే 'విశ్వనాథ్‌ అండ్ సన్స్' రావడం సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు కలిసి వచ్చిన అంశం. యూత్ ను 'ప్రేమలు' చిత్రంతో మెస్మరైజ్ చేసిన మమిత బైజు నాయికగా నటించిన ఈ సినిమాలో రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాతో పాటే వస్తున్న విశాల్‌ 'మకుటం' చిత్రానికీ జీవీ ప్రకాశ్‌ కుమారే సంగీత దర్శకుడు. ఇందులో అంజలి, దుషార విజయన్ కథానాయకులుగా నటించారు. ఇక ఈ వీకెండ్ లో వస్తున్న మరో అనువాద చిత్రం 'ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్'. డేవిడ్ రాబర్ట్ ఈ ఎడ్వంచర్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన 'ది ఎండ్

ఈవ ర న ల గ స ట రయ ట మ డ డబ బ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in