ఈలలతో మాట్లాడే ద్వీపం
Actor ProfileActor

ఈలలతో మాట్లాడే ద్వీపం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈలలతో మాట్లాడే ద్వీపం గురించి విన్నారా ఎప్పుడైనా
Sakshi5 Nov 2026
ఈలలతో మాట్లాడే ద్వీపం గురించి విన్నారా ఎప్పుడైనా

స్పెయిన్‌ లోని కేనరీ దీవుల్లో ఉన్న చిన్న ద్వీపం లా గోమెరాలో ఒక వింత సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కొన్ని సందర్భాల్లో మాటలతో కాకుండా ఈలల ద్వారానే మాట్లాడుకుంటారు. ఈ ప్రత్యేక భాషను సిల్బో గొమెరో అని పిలుస్తారు. పర్వతాల మధ్య ఉన్న లోయలు, ఘాట్‌ రోడ్ల వల్ల దూరంగా ఉన్న వారికి సందేశం పంపడానికి ఈ పద్ధతి అనేక శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈల శబ్దంతోనే సందేశాన్ని చేరవేస్తారట ఇక్కడ. ఒకానొక సమయంలో రోడ్లు, ఫోన్లు ఎక్కువ అవడంతో ఈ సంప్రదాయం అంతరిస్తుందేమో అని చాలా మంది భయపడ్డారట. కానీ లా గోమెరా అధికారులు తమ ఈల భాషను రక్షింకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ద్వీపంలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో సిల్బో గొమెరో అనే ఈల భాషను తప్పనిసరిగా బోధిస్తున్నారు. 2009లో యునెస్కో కూడా ఈ భాషను ఇంటాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌గా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ ఈల శబ్దాలు విన్నప్పుడు వాటిని వినే వారి మెదడులో సాధారణ భాషను అర్థం చేసుకునే లాంగ్వేజ్‌ సెంటర్లు అలాగే పని చేస్తాయట. అంటే మన మెదడు శబ్దం ఎలా ఉన్నా కూడా దానిలో ఉన్న అర్థాన్ని డీకోడ్‌ చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సాంకేతిక యుగంలో కూడా ఈ ఈల భాష ఇంకా వాడుకలో ఉండడం అనేది నిజంగా అద్భుతం. సిల్బో గొమెరో అనేది మానవ సజనాత్మకత, సంస్కతి, ప్రకతికి అనుగుణంగా మనిషి ఎలా మారగలడో చూపించే అరుదైన ఉదాహరణగా నిలిచింది. హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి రాశి ఖన్నా (ఫొటోలు) వింబుల్డన్‌ విజేత జానిక్‌ సిన్నర్‌ (ఫొటోలు) వింబుల్డన్‌ ఫైనల్లో భారత క్రికెటర్ల హల్‌చల్‌.. స్పెషల్‌ అట్రాక్షన్‌ వైభవ్‌ సూర్యవంశీ (ఫొటోలు) ఘనంగా ముగిసిన టీజీ20