ఈరోజే లాస్ట్ డేట్..ఆలస్యమైతే వడ్డీతో సహా ఫైన్
Actor ProfilePolitician

ఈరోజే లాస్ట్ డేట్..ఆలస్యమైతే వడ్డీతో సహా ఫైన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈరోజే లాస్ట్ డేట్..ఆలస్యమైతే వడ్డీతో సహా ఫైన్
Oneindia Telugu25 Dec 2026
ఈరోజే లాస్ట్ డేట్..ఆలస్యమైతే వడ్డీతో సహా ఫైన్

కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధి (పీఎఫ్)కి సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల యజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల పీఎఫ్ చందాను సకాలంలో జమ చేయడంతో పాటు ఈసీఆర్ (ECR) దాఖలు చేయడానికి ఆగస్టు 15వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఈ గడువు తప్పితే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.జూలై నెల జీతాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ దాఖలు చేసి, ఉద్యోగుల పీఎఫ్ చందాను ఖాతాల్లో జమ చేయడానికి ఈరోజే చివరి అవకాశమని ఈపీఎఫ్‌ఓ సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేసింది. యజమానులు తమ బాధ్యతను సకాలంలో నెరవేర్చడం ద్వారా ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బులు ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే క్రెడిట్ అవుతాయి.ఈ గడువు ఎందుకు అంత ప్రాముఖ్యమైనది?ఉద్యోగస్తులకు తమ భవిష్యత్తు కోసం పీఎఫ్ ఖాతానే ప్రధాన ఆధారంగా ఉంటుంది. ప్రతినెలా ఉద్యోగి వేతనం నుంచి కట్ చేసిన సొమ్ముకు, యజమాని తన వంతు వాటాను కలిపి ఈపీఎఫ్‌ఓ వద్ద జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీలు ఈ చందాను సకాలంలో కట్టకపోతే ఉద్యోగుల ఖాతాల్లో జమ ఆలస్యమవడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లెక్కింపుపై ప్రభావం పడుతుంది. అందుకే సంస్థలు ఈ గడువును సీరియస్‌గా తీసుకోవాలని ఈపీఎఫ్‌ఓ ఆదేశించింది.EPFO, LIC: వెలుగులోకి వచ్చిన కోట్ల రూపాయలు, పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన!ఆలస్యమైతే కంపెనీలకు తప్పవు భారీ జరిమానాలు!చట్టబద్ధంగా నిర్ణయించిన తేదీలోగా పీఎఫ్ చందాను చెల్లించని సంస్థలపై ఈపీఎఫ్‌ఓ కఠిన చర్యలు తీసుకోనుంది. నిర్ణీత గడువు దాటితే ఆలస్యమైన రోజులకు గాను అదనపు వడ్డీతో పాటు భారీగా డిఫాల్ట్ చార్జీలు, పిలేటివ్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా నిబంధనల చిక్కులు, అదనపు ఆర్థిక భారాల నుంచి తప్పించుకోవాలంటే యజమానులు తక్షణమే ఈసీఆర్ దాఖలు చేసి డబ్బులు జమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.EPFO