ఇందిరమ్మ ఫ్లాట్ల
Actor ProfilePolitician

ఇందిరమ్మ ఫ్లాట్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇందిరమ్మ ఫ్లాట్లపై బిగ్ అప్ డేట్.. నేడే శంకుస్థాపన.. హైదరాబాద్ లో ఈ ఏరియాల్లోనే
TV9 Telugu13 Dec 2026
ఇందిరమ్మ ఫ్లాట్లపై బిగ్ అప్ డేట్.. నేడే శంకుస్థాపన.. హైదరాబాద్ లో ఈ ఏరియాల్లోనే

హైదరాబాద్‌: నగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భూమిపూజ చేయనున్నారు. హైదరాబాద్‌ పరిధిలో మొత్తం లక్ష ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. CURE పరిధిలో 12 వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్లను నిర్మించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.807.40 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఇందిరమ్మ ఫ్లాట్లలో ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది. అంటే మోత్తం ఫ్లాట్ నిర్మాణారికి రూ.11లక్షలు కాగా.. లబ్ధిదారుడి వాటా రూ.6 లక్షలుగా నిర్ణయించారు. ఒక్కో ఫ్లాట్‌లో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఇందిరమ్మ ఫ్లాట్లను పొందాలి అంటే లబ్ధిదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలు దాటకూడదు. అలాగే దరఖాస్తుదారుడికి CURE పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, స్థలం లేదా ఫ్లాట్ ఉండకూడదు. ఒక ఫ్యామిలీకి కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు. దరఖాస్తుదారు ప్రస్తుతం నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హతలను పరిశీలించిన అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. రూ.100 దరఖాస్తు ఫీజుతో పాటు రూ.10 వేల టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. ఫ్లాట్ కేటాయింపు జరగకపోతే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఫ్లాట్ కేటాయిస్తే లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు. ఫ్లాట్ల కేటాయింపులో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు

ఇ ద రమ మ ఫ ల ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in