
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు సొంతిల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేస్తూ, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే ప్రయత్నం చేస్తుంది. విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అందిస్తున్న తెలంగాణ సర్కార్ తాజాగా లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పింది.చివరి విడత లక్ష రూపాయల చెల్లింపులు త్వరలోనేఇప్పటికే మొదటి దశలో ఇల్లు నిర్మించుకున్న వారికి అందాల్సిన చివరి విడత లక్ష రూపాయల చెల్లింపును త్వరలోనే అందిస్తామని ప్రకటించింది. ఈ చివరి విడత లక్ష రూపాయల చెల్లింపును ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విడుదల చేయాలని గృహ నిర్మాణ సంస్థ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకం కింద ఒక్కో ఇంటికి 72 వేల రూపాయల వాటా రావాల్సి ఉంది.నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి చివరి విడత డబ్బులుఅయితే ఆ నిధులు ఎప్పుడు వస్తాయి అన్న స్పష్టత లేకపోవడంతో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చివరి విడత చెల్లింపులు జరగలేదు. అయితే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి చివరి విడత డబ్బులు ఇవ్వడానికి తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే వారి ఖాతాలో డబ్బు జమ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తుంది.చివరి విడత డబ్బులు జమ అప్పుడే ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చివరి విడత డబ్బులు జమ చేస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 3.68 లక్షల ఇళ్లను కేటాయించింది. అందులో 3.22 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికి 1.60 లక్షల మంది గృహప్రవేశాలు కూడా చేశారు ప్రస్తుతం ఈ లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి సంబంధించిన