ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం
Actor ProfileActor

ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం
Chitrajyothy25 Nov 2026
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం

కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ప్రేరణా అరోరా, జీ స్టూడియోస్ తో కలిసి 'ఇంద్రపుత్ర' పేరుతో ఓ మైథలాజికల్ మూవీని నిర్మించబోతున్నారు. యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'తో తన ఖాతాలో మరో రూ. 50 కోట్ల సినిమాను జమ చేసుకున్నాడు. 'క', 'కె-ర్యాంప్' తర్వాత కిరణ్‌ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ'కి డివైడ్ టాక్ వచ్చినా... కలెక్షన్స్ మాత్రం నిర్మాతలను సంతృప్తి పరిచాయి. ఈ విజయంతో రెట్టిన ఉత్సాహంతో కిరణ్‌ అబ్బవరం ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే అతని 13వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి 'రియాలిటీ' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ నటి దేవికా భట్ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ లో విడుదల చేయాలన్నది కిరణ్‌ అబ్బవరం ఆలోచన. ఆ తర్వాత అతని 14వ సినిమా సుకుమార్ రైటింగ్స్ లో ఉండబోతోంది. అశోక్ బండ్రెడ్డి, వంశీ నందిపాటి నిర్మించే ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు వీరా కోగటం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదో క్రైమ్ థిల్లర్ మూవీ. దీని తర్వాత కిరణ్‌ అబ్బవరం మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య సుధీర్ బాబుతో 'జటాధర' చిత్రాన్ని నిర్మించిన ప్రేరణా అరోరా జీ స్టూడియో తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఓ పోస్టర్ ద్వారా స్వయంగా కిరణ్‌ అబ్బవరం సోమవారం చేశాడు. ఈ మైథలాజికల్ మూవీకి 'ఇంద్రపుత్ర' అనే పేరు పెట్టారు. అక్టోబర్ లో ఇది సెట్స్ పైకి వెళుతుంది. వచ్చే యేడాది జనం ముందుకు వస్తుంది. ఈ సినిమాను శ్రీకాంత్‌ పుప్పాల డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనిని ఒక సినిమాగా కాకుండా సినిమాటిక్ యూనివర్శ్ గా తీయబోతున్నట్టు తెలుస్తోంది. అందులో 'ఇంద్రపుత్ర'

ఇ ద రప త రగ క రణ అబ బవర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in