ఇండియాలో స్కూల్ టీచర్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏపీ
Actor ProfilePolitician

ఇండియాలో స్కూల్ టీచర్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏపీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇండియాలో స్కూల్ టీచర్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏపీ, తెలంగాణలో ఎంతమంది
Asianet News Telugu9 Oct 2026
ఇండియాలో స్కూల్ టీచర్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏపీ, తెలంగాణలో ఎంతమంది

Teachers : భారత దేశ జనాభా వందకోట్లు దాటింది... ఇందుకు తగ్గట్లుగానే టీచర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు... కాబట్టి వీరికి విద్యాబుద్దులు నేర్పే టీచర్లు కూడా అదే స్థాయిలో ఉంటారు. తాజాగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ టీచర్ల గురించి ఆసక్తికరమైన రిపోర్ట్ విడుదల చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా టీచర్ల సంఖ్య కోటి దాటిందని విద్యాశాఖ వెల్లడించింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ కోటి మంది టీచర్లలో 54.9 శాతం మహిళలే... అంటే 50 లక్షలకు పైగా మహిళా టీచర్లు ఉన్నారన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, అందులో పనిచేస్తున్న టీచర్లు, స్టూడెంట్, విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకునేందుకు కేంద్ర విద్యాశాఖ ఓ సర్వే నిర్వహించింది. ఈ వివరాలతో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) రిపోర్ట్ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం టీచర్ల సంఖ్య 1,01,22,420 మందిగా ఉన్నారు... ఇందులో మహిళలే ఎక్కువమంది ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుల సంఖ్య కోటి కంటే తక్కువగా ఉండేది. కానీ ఈ విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే వివిధ రాష్ట్రాలు భారీగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల నియామకాలు చేపట్టాయి. ఇదే సమయంలో ప్రైవేట్ స్కూల్స్, వాటిలో టీచర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో దేశ చరిత్రలోనే మొదటిసారిటీ టీచర్ల సంఖ్య కోటి దాటింది. ఇది విద్యారంగంలో పురోగతిని సూచిస్తోంది. అయితే కోటి మందికిపైగా టీచర్లను కలిగివున్న ఇదే దేశంలో లక్షకు పైగా పాఠశాలలు ఇప్పటికీ ఒకే టీచర్‌తో నడుస్తుండటం ఆందోళన కలిగించే విషయం. దేశంలో వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన సుమారు 24.72 కోట్ల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 14.67 లక్షల పాఠశాలలు పనిచేస్తున్నాయి. దేశంలోని పాఠశాలల్లో బాలికల నమోదు రేటు మెరుగుపడుతోందని