
భారత పురుషల క్రికెట్ జట్టు గతంలో ఎన్నడూ లేనంత విధంగా గాయాల సమస్యను ఎదుర్కొంటుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రస్తుతం ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంలా కాకుండా ‘ఆస్పత్రి వార్డు’ను తలపిస్తోంది. జట్టులో చాలా మంది కీలక ఆటగాళ్లు అక్కడే చికిత్స పొందుతున్నారు. మైదానంలో మెరుపులు మెరిపించాల్సిన మన స్టార్ క్రికెటర్లు సీఓఈలో గాయాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం సీఓఈలో ఉన్న ఆటగాళ్లతో ఒక జట్టునే తాయారు చేయవచ్చు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్‌తో అత్యవసర భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. దైనిక్ జాగరణ్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం 13 మంది భారత క్రికెటర్లు సీఓఈలో ఉన్నారు. వారిలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా టాప్ క్రికెటర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఎడమ మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. మోకాలి కీలులో చేరిన వాటర్‌ను తొలగించి జాయింట్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ రన్నింగ్, డ్రిల్స్ చేసే సమయంలో మోకాలిలో అతడికి ఇంకా నొప్పి ఉంది. పూర్తి స్థాయి బౌలింగ్ వర్క్‌లోడ్‌ను తట్టుకునే స్థితిలో అతడు లేడు. దీంతో జస్ప్రీత్ లంక టూర్‌కు దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్తేమి కాదు. ఈ బరోడా క్రికెటర్ జట్టులో కంటే ఎక్కువగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఎక్కువగా గడుపుతుంటాడు. ఐపీఎల్ తర్వాత ఇప్పటివరకు అతడు ఇంకా జాతీయ జట్టులోకి తిరిగి రాలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే అతడు తొడ కండరాల గాయం కారణంగా సీఓఈలో చేరాడు. అయితే అతడు వేగంగా కోలుకోవడంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు