
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హీరోయిన్ త్రిష పేరు నెట్టింట తరచూ వైరల్‌గా మారుతోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొనడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఆమె మొదటి వరుసలో కూర్చుని కార్యక్రమాలను వీక్షించారు. వేడుకలకు హాజరైన అధికారులను చిరునవ్వుతో పలకరిస్తూ.. వారికి అభివాదం చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లోకి త్రిష వస్తారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ కొన్ని పోస్టర్లు కూడా వెలిశాయి. మరోవైపు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ త్రిషను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అలాగే త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ మదురై వ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు, అభిమానులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా త్రిష స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వీడియో వైరల్ కావడంతో.. ఆమె రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. అయితే త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారంపై ఆమె నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆమె తాజా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం అభిమానుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. జెన్‌జీతో మోదీ కనెక్ట్.. వందేమాతరం హైలైట్.. ఎర్రకోటపై కొత్త సందేశం (చిత్రాలు) అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు) వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు) 'అమీర్ లోగ్' హీరోయిన్